Site icon vidhaatha

THE FAMILYMAN2:ట్రైల‌ర్ విడుద‌ల‌

విధాత:గ‌త కొద్ది రోజులుగా స‌స్పెన్స్ క్రియేట్ చేస్తూ వ‌స్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 టీం ఎట్ట‌కేల‌కు స‌స్పెన్స్ తెర‌దించింది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేస్తూ స్ట్రీమింగ్ టైంను ఫిక్స్ చేశారు. జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారం కానున్న‌ట్టు పేర్కొన్నారు. ట్రైల‌ర్‌లో మ‌నోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్ అనే పాత్ర‌లో క‌నిపించ‌గా, అత‌ను జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్‌ సెల్‌లో పని చేసే ఓ మధ్యతరగతి వ్యక్తి అని తెలిసింది.

శ్రీకాంత్‌పైనే ఎక్కువ స‌న్నివేశాల‌ను చూపించ‌గా అతడు ఆఫీసులో ఏ ప‌ని చేయ‌డ‌ని, ఇంట్లోను స‌రిగా ఉండ‌డ‌ని నింద‌లు ఎదుర్కొంటూ ఉంటాడు. ఉగ్రవాదులను తుద ముట్టించే సీన్లలో శ్రీకాంత్‌ ఒక సైనిక వీరుడిగా కనిపిస్తున్నాడు. మరోవైపు సమంత సూసైడ్‌ బాంబర్‌గా కనిపించింది. తొలి సారి డీ గ్లామ‌ర‌స్ లుక్‌లో స‌మంత ఆక‌ట్టుకుంది. వాళ్ల‌ను నేనే చంపుతా అంటూ స‌మంత చెప్పిన డైలాగ్ వెబ్ సిరీస్‌ఫై మ‌రిన్ని అంచ‌నాలు పెంచింది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version