Tollwood|సౌత్‌లో భాషాభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మన తెలుగుభాషపై ప్రత్యేక గౌరవం ఉంటుంది. అప్పటి నుండి నేటి వరకు కూడా కొందరు తెలుగుపై ప్రత్యేక పట్టు సంపాదించారు. హీరోలే కాక దర్శకులు,రచయితలు కూడా తెలుగుని అవపాసన పట్టారు. అయితే ఈ తరం హీరోలలో కొందరు హీరోలకి తెలుగు చదవడం, రాయడం రాదట. పక్క రాష్ట్రాల నటులు తెలుగు నేర్చుకొని మంచిగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యింపజేస్తుంటే మన తెలుగు హీరోలు కొందరికి ఇంకా తెలుగు చదవడం, రాయడం రాదట. అందులో ముందుగా మహేష్ బాబు ముందు ఉన్నాడు. ఆయన చెన్నైలో పుట్టి పెరగడంతో ఇంగ్లీష్ మీడియం చదివాడు. ఆయన తండ్రి కృష్ణ తెలుగు హీరో అయినా కూడా మహేష్ బాబు మాత్రం మాతృ భాషను నిర్లక్ష్యం చేశాడు అనే చెప్పాలి.
ఆయన డైలాగ్స్ కూడా ఇంగ్లీష్ లో రాసుకుని చదువతాడట. అంతే కాదు తెలుగు చదవడం, రాయడం సూపర్ స్టార్ కు రాదు. ఇక అల్లు అర్జున్ ది కూడా అదే పరిస్థితి అని అంటున్నారు. బన్నీ కూడా మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల తెలుగులో రాయడం ఏ మాత్రం రాదట. ఇక చదవడం అంటే ఏదో కష్టపడి చదువుతాడట. డైలాగ్స్ అంటే తప్పకుండా ఇంగ్లీష్ లో రాసుకోవాల్సిందే అని సమాచారం. ఇక తెలుగు రాని హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఆయన కూడా చెన్నైలోనే పుట్టాడు కాని చిన్నతనంలోనే హైదరాబాద్ షిప్ట్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ్ కూడా స్పష్టంగా మాట్లాడే రామ్ చరణ్‌కి తెలుగు చదవడం, రాయడం రాదట. ఇప్పుడిప్పుడే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట.
ఇక అక్కినేనివారి అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ కు కూడా ఒక్క ముక్క కూడా తెలుగు రాదట. వారి డైలాగ్స్ ఇంగ్లీష్ లో రాసుకుని చెప్పుకోవడమేనంటున్నారు. వారి తండ్రి నాగార్జున పరిస్థితి కూడా అంతేనట. ఆయన కూడా తెలుగులో స్పస్టంగా మాట్లాడుతారు కాని.. తెలుగు రాయడం , చదవడం మాత్రం రాదట. వెంకటేష్ కూడా ఫారెన్ లోనే చదివి వచ్చారు. దాంతో వారికి తెలుగుపై గ్రిప్ లేదని అంటున్నారు. ఇక మంచు లక్ష్మీతో పాటు.. మంచు విష్ణు, వరుణ్ తేజ్, వరుణ్ సందేష్, నిహారిక, రానా దగ్గుబాటి, సుశాంత్, హీరో శ్రీకాంత్ లకు కూడా తెలుగు రాయడం, చదవడం రాదని తెలుస్తుంది. ఇక పాత తరం నటీమణులలో చూస్తే జయసుధ కూడా తెలుగు రాయడం , చదవడం రాదట. తెలుగులో ఇంత స్టార్ స్టేటస్ సంపాదించిన వీరు ఇప్పటికీ తెలుగు చదవడం, రాయడం రాదంటే అందరు ఆశ్చర్యపోతున్నారు.