Site icon vidhaatha

తలచుకుంటూ .. రాత్రంతా ఏడ్చాను

విధాత:సింగర్‌ సునీత తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు అనుభవించారు. అవమానాలను ఎదుర్కొన్నారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో గతంలో ఓ దర్శకుడు తనతో విచిత్రంగా వ్యహరించారని, ఓ ప్రముఖ సంగీత దర్శకుడు స్టూడియోలో ఎదురైన చేదు అనుభవం గురించి తెలిపారు. ‘‘ఓ పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ స్టూడియోలో పాట పాడటానికి వెళ్లాను. అక్కడ నాకు అనుకోని సంఘటన ఎదురైంది. దానిని తలుచుకుంటూ ఆ రాత్రంతా ఏడ్చాను. అక్కడికి వెళ్లాక ఆ డైరెక్టర్‌ తన చేతిలో ఉన్న మైకు ఇచ్చి పాడమన్నారు.

ఆ పూర్తి చేసి మైక్‌ అక్కడ పెట్టి తిరిగి వస్తుంటే బయట ఆ దర్శకుడి భార్య ఆసహ్యంగా మాట్లాడింది. ‘మైక్‌ తీసుకునేటప్పుడు మా ఆయన చేతి వేళ్లను తాకుతున్నావు ఏంటీ? అసలేమనుకుంటున్నావు. నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది. ఆ మాటలకు షాక్‌ అయ్యాను. నా స్టైల్లో ఆమెకు సమాధానం ఇచ్చాను. ధైర్యంతో మాట్లాడినప్పటికీ ఆమె అలా అడగడం చాలా బాధనిపించింది. ఇలా నా కెరీర్‌లో తప్పు లేకపోయినా నిందలు ఎదుర్కొన్నా. ఇంటికెళ్లాక ఆ సంఘటన తలచుకుంటూ రాత్రంతా ఏడ్చాను. అప్పుడు కొందరిని కొట్టాలనిపించింది’’ అని సునీత భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఆ సంగీత దర్శకుడు ఎవరన్నది సునీత బయటపెట్టలేదు.

Exit mobile version