Site icon vidhaatha

ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్..RGV షాకింగ్ కామెంట్

విధాత:RGV సంచలనాలకు మారు పేరు ఇది. ఈ వివాదాస్పద దర్శకుడు ఎప్పుడు, ఏం అంశంపై, ఎలా స్పందిస్తారో ఆయనకే తెలియదు. విషయం ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కున్న ఆఫ్గనిస్తాన్ పరిస్థితులపై రియాక్ట్ స్పందించారు. చేతిలో ఆయుధాలు పట్టుకొని అధ్యక్ష భవనంలో జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించన వీడియోని షేర్‌ చేస్తూ.. వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని ట్వీట్‌ చేశాడు.

అలాగే కాబూల్‌లోని ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లిన తాలిబన్లు అక్కడ ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలా రైడింగ్ చేస్తూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న వీడియో షేర్ చేస్తూ.. ‘ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్’ అంటూ ఆర్టీజీ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.