Tollywood Stars Success Rate | తెలుగు సూపర్ స్టార్ల సక్సెస్ రేట్ : ఎవరెక్కడ?

Tollywood Stars Success Rate | సక్సెస్ రేట్ – విజయ శాతం. ఇదే కథానాయకుల ప్రతిష్టకు కొలమానం. వారి బ్రాండ్ విలువకు సాక్ష్యం. ప్రస్తుత తరంలో తెలుగు సూపర్ స్టార్లు పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు ఉన్నారు. వారు చేసిన మొత్తం చిత్రాలు, అందులో హిట్లు ఎన్ని? అనే లెక్క ఆధారంగా విజయశాతం గణిస్తారు.

Tollywood Stars Success Rate | మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఈ తరం తర్వాత వచ్చిన వారిలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు (Pawan Kalyan, Prabhas, NTR, Ram Charan, Mahesh Babu) అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఐదుగురు మంచి నటులే. అందులో సందేహం లేదు. వారి తొలి సినిమా నుండి నేటికి విడుదలైన సినిమా వరకు వారి చిత్రాలు చాలా విజయవంతమయ్యాయి. ఇందులో కొందరు పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయారు. వందల కోట్ల బడ్జెట్, వేల కోట్ల కలెక్షన్లతో పరిశ్రమ రికార్డులను తిరగరాస్తున్నారు. దేశాల సరిహద్దులను చెరిపేస్తున్నారు. నిజానికి పై ఐదుగురిలో ఎవరు 30 సినిమాలు కూడా చేయలేదు. కానీ, వారి పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.

తొలిప్రేమ(toli Prema)తో తొలిహిట్ అందుకున్న పవన్ క‌ళ్యాణ్, యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. నేటికీ అది కొనసాగుతోంది. ఎన్టీఆర్‌కు సింహాద్రి(Simhadri), రామ్‌చ‌ర‌ణ్‌కు మగధీర(Magadheera), ప్రభాస్‌కు ఛత్రపతి(Chatrapathi), మహేశ్ బాబుకు మురారి(Murari) ఘన విజయాలు అందించాయి. అక్కన్నుంచే వారి చక్రం తిరిగిపోయింది. వాస్తవానికి వీరి విజయ శాతానికి, వీరి క్రేజ్‌కు సంబంధం లేకపోయినా, వారి కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోతుంది కాబట్టి, ఈ లెక్కలు తీసారు. వీటి ప్రకారం, ఈ ఐదుగురి సక్సెస్ రేట్ ఈ విధంగా ఉంది.

1. 5వ స్థానంలో ప్రభాస్(Prabhas at No.5)ఉన్నారు. ఈయన చేసిన మొత్తం చిత్రాలు 23. వాటిలో విజయం సాధించినవి 10 మాత్రమే. విజయ శాతం 43%
2. 4వ స్ఠానంలో ఎన్టీఆర్(NTR at No.4)నిలిచారు. ఆయన చేసిన సినిమాలు 29 కాగా, 13 చిత్రాలు హిట్ అయ్యాయి. సక్సెస్ రేట్ : 45%
3. 3వ స్ఠానంలో ఉన్నది హేశ్ బాబు(3rd is Mahesh Babu). మహేశ్ చేసిన మొత్తం సినిమాలు 28 కాగా, వాటిలో 14 సినిమాలు విజయవంతమయ్యాయి. విజయ శాతం : 50%
4. 2వ స్థానంలో రామ్‌చ‌ర‌ణ్‌( Ram Charan at 2nd) నిలిచారు. రామ్‌చ‌ర‌ణ్‌ చేసినవి 14 సినిమాలు. అందులో 9 సినిమాలు హిట్ అయ్యాయి. సక్సెస్ రేట్ : 63%
5. ఇక నెంబర్ 1 స్ఠానంలో ఎవరున్నారో ఊహించడం కష్టం కాదు. అల్లు అర్జున్(Allu Arjun at No.1). ఈయన చేసిన మొత్తం చిత్రాలు 20 కాగా, వాటిలో విజయవంతమైనవి 14. సక్సెస్ రేట్ : 70%

అయితే ఆరో స్ఠానంలో పవన్ క‌ళ్యాణ్(Pawan Kalyan at 6) ఉన్నారు. అయన కెరీర్ మొత్తంలో చేసినవి 28. అందులో 11 మాత్రమే సక్సెస్ అయ్యాయి. విచిత్రంగా ఈ ఐదుగురి కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. వీరిలో నలుగురు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లు(Four are PAN India Stars). ప్రభాస్ బాహుబలి, కల్కి(Kalki)తో, రామ్‌చ‌రణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్(RRR)తో, అల్లు అర్జున్ పుష్ప(Pushpa)తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో వీరు చేసే సినిమాల వేగం కూడా తగ్గుతోంది. అన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం, భారీ బడ్జెట్, విఎఫ్ఎక్స్లు, పెద్ద దర్శకులు, భారీ లక్ష్యాలు కూడా పెట్టుకోవడంతో అలస్యం అనివార్యమవుతోంది. తప్పదు. కొన్ని విషయాలు అభిమానులు భరించాల్సిందే. దీనివల్ల విజయశాతాల్లో కొద్ది మార్పే వచ్చినా, కొత్త సినిమా సాధించబోయే ఘనవిజయం, దాని కలెక్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో వారి పేరు మరింత ఉన్నతస్థాయికి చేరే అవకాశముంటుంది.