Site icon vidhaatha

Naga Chaitanya|నాగ చైత‌న్య పెద్ద సైకో..స‌మంత‌తో పాటు శోభిత జీవితం కూడా నాశన‌మే

Naga Chaitanya| సమంతతో బ్రేకప్ తర్వాత నాగ చైతన్య పర్సనల్ లైఫ్ మీడియాలో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో మ‌నం చూశాం. ఇప్ప‌టికీ స‌మంత చైతూ విడాకుల గురించి నెట్టింట వార్త‌లు వ‌స్తుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మీడియాలో ప్ర‌చారం అవుతున్న‌ట్టుగానే ఆగస్టు 8న శోభిత- నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక త్వ‌ర‌లో పెళ్లి కూడా జ‌ర‌గ‌నుంది. ఎప్పుడైతే వీరి నిశ్చితార్థం జ‌రిగిందో అప్ప‌టి నుండి వారి గురించే అంద‌రు ముచ్చటించుకుంటున్నారు. వీరికి ఎక్క‌డ ప‌రిచ‌యం ఏర్ప‌డింది, ఎన్నాళ్ల నుండి ప్రేమ‌లో ఉన్నారు, వీరిద్ద‌రు అయిన క‌లిసి ఉంటారా అనే చ‌ర్చ న‌డుస్తుంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి శోభిత జాతకాన్ని బాగా పరిశీలించానని, ఆమె జాతకం అసలు బాగోలేదని తేల్చేశారు. నాగచైతన్యది కర్కాటక రాశి అని, శోభితది ధనుస్సు రాశి అని, చైతూకు ఆరు, శోభితకు ఎనిమిది వచ్చాయని దీనివల్ల ఇద్దరి జాతకాల్లో షష్టకాలు వచ్చాయన్నారు. చైతూకు, సమంతకు తాను 100కు 50 మార్కులిస్తానని, అదే చైతూకు, శోభితకు అయితే కేవలం 100కు 10 మార్కులిస్తానని చెప్పారు. 50 మార్కులిచ్చిన సమంత విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు పది మార్కులిచ్చిన శోభిత విషయంలో ఏం జరగబోతుందో అర్థం చేసుకోవాలన్నారు. వారి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయని, అందుకు కారణం ఓ స్త్రీ అని కూడా చెప్పి వేణుస్వామి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఇక సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయర్ ఉమైర్ సంధు త‌న ట్విట్ట‌ర్‌లో నాగ చైత‌న్య‌, శోభిత గురించి సంచ‌ల‌న కామెంట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. స‌మంత‌ని పెళ్లి చేసుకొని ఆమె జీవితం నాశ‌నం చేశాడ‌ని చైతూపై ఫైర్ అయిన ఉమైర్ సంధు ఇప్పుడు శోభితని ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆమె జీవితం నాశ‌నం చేసేలా ఉన్నాడంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేసాడు. నాగ చైత‌న్య పెద్ద సైకో కావ‌డం వ‌ల్ల‌నే అత‌డిని స‌మంత వ‌దిలేసిందంటూ తన సోష‌ల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఉమైర్ సంధుని ఓ రేంజ్‌లో తిట్టి పోస్తున్నారు నెటిజ‌న్స్

Exit mobile version