Unstoppable 4| నందమూరి బాలకృష్ణ తనలోని మరో యాంగిల్ చూపిస్తూ అన్‌స్టాపబుల్ (Unstoppable)అనే షోతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నాడో మనం చూస్తున్నాం. . ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న.. అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ షోను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు బాలయ్య(Bala Krishna). ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్స్ ను పూర్తి చేసుకోగా, ఇప్పుడు నాలుగో సీజన్‌కి సిద్ధమవుతుంది. ఈ సీజన్‌కి హోస్ట్‌లుగా ఎవరెవరు రాబోతున్నారు, ఫస్ట్ గెస్ట్ ఎవరు అన్నది ప్రేక్షకులలో ఆసక్తికరం కాగా, దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బాలయ్య షోకు అన్ స్టాపబుల్ సీజన్ 4కి మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandra babu Naidu) రానున్నారు. గతంలో అన్ స్టాపబుల్ సీజన్ 2కి చంద్రబాబు హాజరయ్యారు.
అన్‌స్టాపబుల్ తొలి ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరగనుంది. చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ఈ షోలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. వారిని బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ చేయనున్నారట. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ షోకి హాజరు అయ్యారు. అయితే ఇప్పుడు వారు సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో షోకి హాజరు కానుండడంతో అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఇందులో నిజం ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది.
ఈ నెల 24 ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఫస్ట్ చంద్రబాబుపై షూట్ చేయబోతున్న ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ ఎపిసోడ్ ని షూట్ చేశారు. ఆయనదే ఫస్ట్ ఎపిసోడ్ అని ముందు నుండి ప్రచారం కాగా, ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రావడంతో దాన్ని మధ్యలో టెలికాస్ట్ చేస్తారట. అల్లు అర్జున్(Allu Arjun) ఎసిపోడ్‌ని మూడో ఎపిసోడ్‌గా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో `పుష్ప 2` సినిమా విడుదల కానుంది. దానికి దగ్గరలో సినిమాకి ప్రమోషన్ అయ్యేలా బన్నీ ఎపిసోడ్ టెలికాస్ట్ ఉంటుందని టాక్ కూడా నడుస్తుంది. మరోవైపు దుల్కర్ సల్మాన్(Dulkar Salman) ఎపిసోడ్ కూడా షూట్ చేశారు. ఆయనది కూడా మధ్యలోనే టెలికాస్ట్ అవుతుందట.