ఓటీటీ ప్రియుల‌కి ఈ వారం ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌..థియేటర్‌/ఓటీటీలో రానున్న చిత్రాలివే..!

ఏప్రిల్ మొద‌టి వారంలోకి అడుగుపెట్టాం. ఇక పెద్ద సినిమాల జాత‌ర మొద‌లు కానుంది. మొన్న‌టి వ‌ర‌కు థియేట‌ర్స్‌లో చిన్న సినిమాల సంద‌డి ఉండ‌గా, ఈ నెల నుండి పెద్ద సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.ఈ శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్(ఏప్రిల్ 5) గా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాడు. మలయాళ బ్లాక్ బస్టర్ ముంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్(ఏప్రిల్ 6) కూడా థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతుంది. వీటితో పాటు సందీప్ కిషన్ ప్రాజెక్ట్- జెడ్, భరత నాట్యం(ఏప్రిల్ 5), బహుముఖం(ఏప్రిల్ 6) లాంటి సినిమాలు ఈ వారం ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాయి.

  • Publish Date - April 2, 2024 / 07:10 AM IST

ఇక థియేట‌ర్స్‌లో సంద‌డితో పాటు ఓటీటీలో కూడా మంచి సినిమాలు సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోపీ చంద్ నటించిన భీమా. ఈ చిత్రం థియేట‌ర్స్‌లో బాగానే అల‌రించింది. ఓటీటీలో ఎంతగా మెప్పిస్తుందో చూడాలి. ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తే.. టు గెదర్‌ (వెబ్‌సిరిస్‌) ఏప్రిల్‌ 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఫైల్స్‌ ఆఫ్‌ ది అన్‌ ఎక్స్‌ప్లైన్డ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 03 వ తేదీ నుంచి , రిప్‌లే (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 4 వ తేదీ నుంచి , పారాసైట్‌: దిగ్రే (కొరియన్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 05 వ తేదీ నుంచి , స్కూప్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్ లో చూస్తే మ్యూజికా (హాలీవుడ్) ఏప్రిల్‌ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుండ‌గా, యే మేరీ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌-3) ఏప్రిల్‌ 04 వ తేదీ నుంచి , హౌ టూ డేట్‌ బిల్లీ వాల్ష్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో లంబసింగి- (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02 నుండి స్ట్రీమ్ కానుండగా, భీమా (గోపీచంద్ సినిమా)- ఏప్రిల్ 5 నుండి హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05 నుండి స్ట్రీమ్ కానుంది. యాపిల్ టీవీ ప్లస్ లో లూట్ సీజన్‌- 2(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, సుగర్(హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 05 నుండి స్ట్రీమ్ అవుతుంది.ఇక సోనీలివ్ లో ఫ్యామిలీ ఆజ్‌ కల్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03 నుండి స్ట్రీమ్ కానుంది. అలానే జీ5 ఓటీటీలో ఫర్రీ- (హిందీ సినిమా)- ఏప్రిల్ 05 నుండి స్ట్రీమ్ కానుంది.

Latest News