Marriage| వనితా విజయ్ కుమార్.. ఈమె పేరు నిత్యం వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఆమె మూడో పెళ్లి మీద జరిగినంత చర్చ మరి ఏ ఇతర సెలబ్రిటీ పెళ్లి జరిగి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్ , దివంగత మంజుల కుమార్తె అయిన వనితా విజయ్ కుమార్ ఏ విషయాన్నైనా సరే ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా చెప్పడం ఆమెకు అలవాటు. తండ్రి విజయ్ కుమార్‌తో తగాదాల కారణంగా.. ఆమెను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పంపించారు.అయితే చంద్రలేఖ అనే సినిమాతో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగువారిని పలకరించారు.
దేవి సినిమా తర్వాత వనితాకి అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆమె పెళ్లి చేసుకోవడంతో సినిమాలకి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆమె వైవాహిక జీవితం అంత ఒడిదుడుకులతో సాగింది.తొలుత నటుడు ఆకాష్‌ను ఆమె వివాహం చేసుకోగా.. వీరికి విజయ్ శ్రీ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక కొన్నాళ్లకి ఆకాశ్ నుండి విడిపోయి వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్‌ను పెళ్లాడారు వనిత. వీరికి జయనిత అనే పాప జన్మించింది. అతనితోను విడాకులు తీసుకున్న ఆమె చాలా ఏళ్ల పాటు సింగిల్‌గానే ఉంది. 2020లో కోవిడ్ సమయంలో పీటర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఇద్దరి మధ్యా మనస్పర్ధలు, పీటర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో అతని నుంచి కూడా వనితా విజయ్ కుమార్ విడిపోయారు.
మద్యానికి బానిస అయిన పీటర్.. గతేడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కెరీర్ పరంగా బిజీగా అవ్వాలని చూస్తున్న వినత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె నాలుగో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ అభిమాని వనిత విజయకుమార్‌ను తదుపరి పెళ్లి గురించి ప్రశ్నించగా, అందుకే ఆమె ఊహించనిది ఊహించండి అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో వనిత 4వ పెళ్లికి కూడా రెడీ అవుతోందని అందరు భావిస్తున్నారు.