Site icon vidhaatha

Rana Daggubati|రానాకి దిమ్మ‌తిరిగిపోయే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్.. సౌండ్ లేదుగా..!

Rana Daggubati|ద‌గ్గుబాటి వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రానా మంచి చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. త‌న టాలెంట్‌తో ఎన్నో హిట్స్ కూడా అందుకున్నారు. బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం హీరోగా చేస్తూనే అడ‌పాద‌డ‌పా సపోర్టింగ్ రోల్స్ లో కూడా న‌టిస్తూ అల‌రిస్తున్నాడు. అయితే రానా ప‌లు కార్య‌క్ర‌మాల‌కి హోస్ట్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌ల ఐఫా అవార్డుల వేడుక దుబాయ్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు తెలుగు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.. ఆ అవార్డు వేడుకలో తెలుగు సినిమాలకే ఎక్కువ అవార్డులు రాగా, త‌మిళ న‌టి వరలక్ష్మి శరత్ కుమార్ కు అవార్డు వచ్చింది.

అయితే అవార్డ్ ఫంక్ష‌న్ లో రానా , వరలక్ష్మి మధ్య జరిగిన కన్వీర్జెషన్ అంద‌రు తెగ న‌వ్వేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా కూడా మారింది. ప్రతిష్ఠాత్మక ఐఫా 2024 పురస్కారాల వేడుక అబుదాబిలో జ‌ర‌గ‌గా, 2024కు గాను అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ ఐఫా గోల్డెన్‌ లెగసీ పురస్కారాన్ని స్వీకరించారు. ఐఫా ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం సమంతకు దక్కింది. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ విలన్‌గా షైన్‌ టామ్‌ చాంకో అవార్డులు ద‌క్కాయి. ఉత్త‌మ స‌హాయ న‌టి అవార్డ్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ని వ‌రించింది.

వ‌ర‌ల‌క్ష్మీ అవార్డ్ అందుకున్న త‌ర్వాత రానా మాట్లాడుతూ నీ పెళ్ళికి అందరిని పిలిచావు నన్ను తప్ప అన‌డంతో, దానికి రానా సమాధానం చెబుతూ నీ పెళ్ళికి నన్ను పిలవలేదు అందుకే పిలవలేదు. ఎందుకు పిలవాలి అన్నట్లు సమాధానం చెప్పింది. ఆ మాటతో ఒక్క‌సారి అంద‌రు తెగ న‌వ్వేసారు.వ‌ర‌ల‌క్ష్మీ ఒక్క మాట‌తో రానా ప‌రువు పోయిన‌ట్టు అయింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుది. ఇక రానా ఇప్పుడు నిర్మాతగా రాణించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో కూడా న‌టిస్తున్నాడు. జై హ‌నుమాన్ మూవీలో హీరో రిష‌బ్ శెట్టితో పాటు రానా కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం రిషబ్‌ శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్‌ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version