Venu Swamy| కొంత కాలంగా రహస్య ప్రేమని కొనసాగిస్తున్న నాగ చైతన్య- శోభిత దూళిపాళ్ల ఎట్టకేలకి ఆగస్ట్8న నిశ్చితార్థం జరుపుకున్నారు. నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా ఏంగేజ్మెంట్ జరగగా, ఈ వేడుకకి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇక ఎంగేజ్‌మెంట్ పూర్తయ్యాక నాగార్జున.. ట్విట్టర్ లో కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు.దీంతో నూతన జంటకి అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నాగ చైతన్య, సమంతల బంధం ఎక్కువ కాలం నిలిచి ఉండదని చెప్పిన వేణు స్వామి ఇప్పుడు నాగ చైతన్య- శోభితల ఎంగేజ్‌మెంట్ తర్వాత ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఆగస్ట్ 9 చెబుతానని ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్ చేశారు. శోభిత, నాగ చైతన్య వైవాహిక జీవితంపై సంచలనాత్మమైన, జాతకపరమైన విశ్లేషణ రేపు చేస్తానని వేణు స్వామి ప్రకటించడంతో అక్కినేని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. వారి జీవితం గురించి వేణు స్వామి ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం వేణు స్వామి జాతకం అంతా తుస్సే పెద్దగా పట్టించుకోనక్కర్లేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో వేణు స్వామి చెప్పింది ఒక్కటి కూడా సరిగ్గా జరగలేదు. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని, టీ20 మ్యాచ్‌లో ఇండియాదే విజయమని వేణు స్వామి జోస్యం చెప్పగా అవి తేలిపోయాయి. దాంతో వేణు స్వామిపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. ఇక ఆ సమయంలో తన ప్రెడిక్షన్ తప్పు అయినందుకు సెలబ్రిటిల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన జాతకాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పనంటూ వీడియో ద్వారా తెలియజేశారు వేణు స్వామి.మరి ఇప్పుడు నాగ చైతన్య, శోభితల జాతకం చెబుతానని ఆయన పోస్ట్ చేయడంతో మళ్లీ మొదలు పెడుతున్నాడా అంటూ కొంతమంది మనోడిపై ఫైర్ అవుతున్నారు.