Vijay Devarakonda: విడాకుల తర్వాత సమంత సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ పెంచింది. యశోద చిత్రంతో మంచి హిట్ కొట్టిన సమంత శాకుంతల చిత్రంతో నిరాశపరచింది. ఇక ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీని మరి కొద్ది రోజులలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ లవ్ స్టోరీ అనే విషయం ఇప్పటికే చాలా మందికి అర్ధమైంది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ ఇది కాగా, సమంత కూడా ఏమాయ చేశావే తర్వాత ఇలాంటి ప్రేమకథలో నటించలేదు. దీంతో ఈ మూవీపై అభిమానులలో చాలా అంచనాలే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులని పలకరించనుంది.
ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీ నుండి పలు సాంగ్స్ విడుదల చేస్తుండగా, ఈ క్రమంలోనే సాంగ్ లోని ఓ రొమాంటిక్ క్లిప్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు విజయ్ దేవరకొండ .ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోలో సమంత, విజయ్ దేవరకొండ ఒకే బెడ్‌పై పడుకొని ఉండగా, నిద్రలో వారు ఒకరిని మరొకరు హత్తుకుంటూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ లో ఆరాధ్య అనే సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్లిప్‌కి మా ప్రేమ ఇలానే ఉంటుందని అని విజయ్ దేవరకొండ కామెంట్ పెట్టారు. విజయ్ పోస్టు పోస్టు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఎంతో అలరిస్తుంది.
ఇప్పటి వరకు చిత్రం నుండి రెండు పాటలు విడుదల చేయగా, రెండూ కూడా బాగా క్లిక్ అయ్యాయి. మొదట నా రోజా నువ్వే పాట విడుదల చేయగా, ఈ పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది ఈ పాటకి జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఇటీవల ఆరాధ్య అనే పాటను కూడా విడుదల చేయగా, అది కూడా అందరికీ తెగ నచ్చేస్తోంది. కాగా, సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్‌కి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. చూస్తుంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్, భూమికల ఖుషీ మాదిరిగానే పెద్ద విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.