విధాత : టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)–రష్మిక(Rashmika) మందన్న మూడోసారి కలిసి నటిస్తున్నట్లుగా వెల్లడైన సమాచారం వారి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. డైరక్టర్ రాహుల్ సాంకృత్యాయన్(Rahul Sankrityan) దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామా మూవీలో వారిద్ధరూ కలిసి నటిస్తున్నారని..ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైందని ఇండస్ట్రీ టాక్. అదే నిజమైతే విజయ్ దేవరకొండ– రష్మిక మందన్నలు కలిసి నటిస్తున్న మూడో సినిమాగా ఇది నిలవబోతుంది. గతంలో వీరిద్దరు గీతా గోవిందం(Geetha Govindam), డియర్ కామ్రెడ్(Dear Comrade) సినిమాల్లో నటించారు. విజయ్-రష్మిక మధ్య కెమిస్ట్రీకి అప్పట్లో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోసారి వారిద్దరు కలిసి నటిస్తున్నారన్న సమాచారం అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది.
ట్యాక్సీవాలా(Taxiwala), శ్యామ్ సింగ రాయ్(Shyam Singha Roy) సినిమాలతో కథ..కథనాల్లో తనకంటూ ప్రత్యేక ఒరవడి ఏర్పరుచుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాను కూడా ఓ భిన్నమైన కథాశంంతో తెరెకెక్కిస్తున్నారు. 1854-1878మధ్య దేశంలో బ్రిటీష్ పాలనలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్ కథనం. ఈ సినిమాలో విజయ దేవరకొండ(Vijay Devarakonda) రాయలసీమ యాసలో మాట్లాడే ఓ పల్లెటూరు యువకుడి పాత్రలో కనిపిస్తారట. ఈ సినిమా కథ వినగానే రష్మిక కూడా విజయ్ తో నటించేందుకు అంగీకరించిందని సమాచారం. గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మికలు తాజాగా మరో సినిమాలో కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, ఆడవాళ్లు మీకు జోహార్లు, అయుష్మాన్ ఖురానాతో కలిసి థామా, తెలుగులో మైసా వంటి చిత్రాలతో పాటు కోక్ టైల్ 2, వీడీ 14, యానిమల్ పార్క్, పుష్ప 3, ఏఏ 22 వంటి 8సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ రష్మిక కొత్తగా విజయ్ సినిమాకు ఒకే చెప్పడం చూస్తే వారి మధ్య రిలేషన్ షిప్ కు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్(Kingdom) 2లో నటిస్తునే..కొత్త సినిమా షూటింగ్ లో చేరిపోయారు.