Vijayashanthi | విజ‌య‌శాంతి ప‌వ‌ర్ ఫుల్ లుక్..బ‌ర్త్ డే సంద‌ర్భంగా స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్

Vijayashanthi |  లేడి సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊప‌డం మ‌నం చూశాం. సీనియ‌ర్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి వైవిధ్య‌మైన చిత్రాలు చేసిన విజ‌య‌శాంతి స‌ర్కారు వారి పాట‌తో రీఎంట్రీ ఇవ్వ‌డం మ‌నం చూశాం. ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది.ఇక ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ సినిమాలో న‌టిస్తుంది. NKR21. యాక్షన్‌ జోనర్‌లో వస్తున్నచిత్రం కాగా, ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా

  • Publish Date - June 24, 2024 / 02:14 PM IST

Vijayashanthi |  లేడి సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊప‌డం మ‌నం చూశాం. సీనియ‌ర్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి వైవిధ్య‌మైన చిత్రాలు చేసిన విజ‌య‌శాంతి స‌ర్కారు వారి పాట‌తో రీఎంట్రీ ఇవ్వ‌డం మ‌నం చూశాం. ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది.ఇక ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ సినిమాలో న‌టిస్తుంది. NKR21. యాక్షన్‌ జోనర్‌లో వస్తున్నచిత్రం కాగా, ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అశోక్‌ వర్ధన్‌ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ ల‌క్ విడుద‌ల కాగా, అది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ఇక ఈ రోజు విజ‌య‌శాంతి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె ప‌వ‌ర్ ఫుల్ లుక్ విడుద‌ల చేశారు. చిత్రంలో వైజ‌యంతీ ఐపీఎస్ గా విజ‌య‌శాంతి పాత్ర‌ని ప‌వ‌ర్‌ఫుల్‌గా ఇంట్ర‌డ్యూస్ చేశారు. ”త‌ను ప‌ట్టుకొంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వ‌స్తుంది.. వేసుకొంటే యూనిఫామ్‌కి పౌరుషం వ‌స్తుంది. త‌ను ఒక యుద్ధం.. నేను త‌న సైన్యం” అంటూ కల్యాణ్ రామ్ వాయిస్ ఓవ‌ర్‌లో… వైజ‌యంతీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌డం చూసి ఫ్యాన్స్‌కి పూన‌కం వ‌చ్చింది.చిత్రంలో విజ‌య‌శాంతి సోద‌రుడిగా క‌ళ్యాణ్ రామ్ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

విజ‌య‌శాంతి న‌టించిన క‌ర్త‌వ్యం సినిమాని అంత తేలిక‌గా ఎవ‌రు మ‌ర‌చిపోలేరు. ఈ సినిమా విజ‌య‌శాంతిని కాస్త లేడీ సూప‌ర్ స్టార్ గా మార్చిన సినిమా అది. హీరోయిన్లు పోలీస్ పాత్ర‌ల్లో అద‌ర‌గొడ‌తార‌ని, హీరోయిజం చూపిస్తార‌ని అంద‌రికి ఈ చిత్రం ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు అదే పాత్ర‌లో మ‌ళ్లీ విజ‌యశాంతి క‌నిపిస్తుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డం ఖాయ‌మ‌ని, విజ‌య‌శాంతికి మంచి పేరు రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. తాజాగా విడుద‌లైన టీజర్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుడ‌గా.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది.

Latest News