Site icon vidhaatha

Vishal | ఏమయ్యా విశాల్‌.. పెళ్లి చేసుకుంటావా..? బ్రహ్మచారిగానే ఉండిపోతావా?

Vishal | ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లికాని హీరోలు ఎందరో ఉన్నారు. తోటి హీరోలందరూ పెళ్లి చేసుకొని సంసార జీవితంలో అడుగుపెట్టినా.. వీళ్లు మాత్రం పెళ్లి ఊసెత్తడం లేదు. ఈ లిస్ట్‌లో సౌత్‌ హీరో విశాల్‌ సైత ఉన్నాడు. 46 సంవత్సరాలు వయసు వచ్చినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటే తొందరేముంది అన్నట్లుగా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. గట్టి అడిగితే సల్మాన్‌ ఖాన్‌, శింబు, ప్రభాస్‌.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే తాను కూడా లైఫ్‌లో సెటిల్‌ అవుతానని చెప్పుకు వస్తున్నాడు.

శింబుకు మంచి జోడీని చూసి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారని.. అమ్మాయి కోసం వెతుకుతున్నారని టాక్‌. ఇక ప్రభాస్‌ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్‌కు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా? బ్రహ్మచారి మిగిలిపోతాడా? అని ఫ్యాన్స్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండేళ్ల కిందట విశాల్‌ తెలుగు అమ్మాయి అనీషా అల్లా రెడ్డితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇద్దరికి ఘనంగా నిశ్చితార్థం సైతం జరిగింది. ఆమెతో కొద్దిరోజుల పాటు సహవాసం చేసిన అనంతరం ఒకరినొకరం అర్థం చేసుకొని పెళ్లి పీటలు ఎక్కేందుకు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.

అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ పెళ్లి ఆగిపోయింది. ఇద్దరు సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి నిశితార్థం ఫొటోలు డిలీట్‌ చేశారు. ఇప్పటి వరకు పెళ్లి క్యాన్సిల్‌ అవ్వడానికి కారణాలు సైతం వెల్లడించలేదు. ఆ తర్వాత అనీషా రెడ్డి ఓ వ్యాపారవేత్తను పెళ్లాడినట్లుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌తో లవ్‌ ఎఫైర్‌ ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. తాము మంచి ఫ్రెండ్స్‌ అని ప్రకటించారు.

Exit mobile version