Site icon vidhaatha

Vishal & Sai Dhanshika Engagement : తమిళ హీరో విశాల్, నటి సాయి ధన్సికల నిశ్చితార్థం

Actor Vishal and Sai Dhanshika Engagement

Vishal & Sai Dhanshika Engagement | విధాత : తమిళ హీరో విశాల్, నటి సాయి ధన్సికలు త్వరలో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. శుక్రవారం విశాల్ పుట్టిన రోజు సందర్భంగా వారిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. చెన్నైలోని విశాల్ నివాసంలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో తాము ఆగస్టు 29న పెళ్లి చేసుకుంటామని హన్సికతో కలిసి విశాల్ ప్రకటించారు. అయితే నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్‌.. ఆ సంఘం(నడిగర్) భవనం ప్రారంభోత్సవం తర్వాతనే తను వివాహం చేసుకుంటానన్నారు. ఈ నేపథ్యంలో ఆ భవనం పూర్తి కాకపోవడంతో తన పెళ్ళి వాయిదా వేసుకుని ప్రస్తుతానికి నిశ్చితార్థంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్ ‘మకుటం’ మూవీలో నటిస్తున్నాడు. దానికి సంబంధించిన పోస్టర్ ఇటీవలై విడుదలైంది.

తమిళనాడు తంజావూరుకి చెందిన సాయి ధన్సిక 2006లో ‘మనతోడు మజైకాలం’ అనే తమిళ సినిమాతో మేరినా పేరుతో నటిగా పరిఛయమైంది. 2009లో ‘కెంప’ మూవీతో తనుషిక పేరుతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సాయి ధన్సిక పేరుతోనే సినిమాల్లో కొనసాగుతూ ‘కబాలి’ చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘షికారు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధన్సిక ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ లాంటి తెలుగు సినిమాల్లో అలరించింది.

Exit mobile version