ఆన్ లైన్ మోసం10 కోట్లు నష్టపోయిన బాధితులు..
ఎస్పీ అన్బురాజను ఫిర్యాదు..
విధాత:ఆర్ సి సి ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెడితే ప్రతిరోజూ వడ్డీ వస్తుందని తెలియడంతో మైదుకూరు, ప్రొద్దుటూరు మరికొన్ని ప్రాంతాలకు చెందిన యువకులు ఐదు వేల మంది కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం.ఇలా చైన్ లింకులా ఒక్కొక్కరు రు. 7 లక్షల నుంచి రు.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం.అయితే కొద్ది రోజుల పాటు కొంతమంది కి మాత్రమే కమీషన్ రూపంలో అకౌంట్లలో జమ అయ్యేది.వారం క్రితం అక్కౌంట్ లో ఉన్న డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు కడితే తప్ప మీ కమీషన్లు ఇస్తాం లేకుంటే ఇవ్వమన్నారు.దీంతో నమ్మి మళ్లీ కొంత డబ్బులు పెట్టుబడి పెట్టడంతో తిరిగి కమీషన్ జమ అయ్యింది.అయితే వారం నుంచి డబ్బులు పడడం ఆగిపోయింది.యాప్ ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదు.