Site icon vidhaatha

ఆటో బోల్తా..ఇద్దరు చిన్నారులు మృతి

విధాత:కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం శభాష్‌పురం గ్రామం వద్ద సోమవారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఆటోలో శ్రీశైలం వెళ్తుండగా శభాష్ పురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version