Site icon vidhaatha

పెళ్లికి నిరాకరించిన ప్రియుడి మర్మాంగం కోసేసిన యువతి

విధాత : ప్రేమ వ్యవహారం సాగించి పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడి మర్మాంగం కోసేసిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్ శరణ్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్‌తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలని మహిళా డాక్టర్‌ ఒత్తిడి తెస్తుండగా అతను నిరాకరిస్తూ వస్తున్నాడు.

చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించి చివరి నిమిషంలో రాకపోవడంతో ఆగ్రహించిన యువతి అతడి ఇంటికి వెళ్లి పథకం మేరకు మర్మాంగం కోసేసింది. బాధితుడి కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version