సోమందేపల్లి మండలం విద్యుత్తు ఇన్‌ఛార్జి ఏఈ సునీల్‌దేశాయ్ (32) కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.కొత్తచెరువు విద్యుత్తు సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఈయన్ను మండల ఇన్‌ఛార్జి ఏఈగా మూడు నెలల కిందట జిల్లా అధికారులు నియమించారు.తల్లిదండ్రులతో కలసి హిందూపురంలో నివాసం ఉంటున్నారు. వారం కిందట కరోనా బారిన పడ్డారు.సొంతూరు మదనపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. అవివాహితుడైన ఆయనకు తల్లిదండ్రులు, ఒక సోదరుడు ఉన్నారు.సునీల్‌దేశాయ్ మృతి చెందడం పట్ల డీఈఈ భూపతిరాజు సంతాపం వ్యక్తం చూశారు.