Site icon vidhaatha

పేకాటలో ప‌ట్టుబ‌డ్డ డ‌బ్బులు గోల్‌మాల్‌..న‌లుగురు పోలీసుల‌పై వేటు వేసిన సీపీ

విధాత,హైదరాబాద్: నగరంలోని వెస్ట్‌జోన్ మంఘల్ హాట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఐదుగురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. మంఘాళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ మురళి, ఈమనెల్, పోలీస్ కానిస్టేబుల్స్ రవి కిరణ్, జానకిరామ్ సస్పెండ్ వేటుకు గురయ్యారు. గతంలో మంఘాళ్‌హాట్‌లో పేకాట స్థావరంపై దాడులు జరిపి రూ.2.50 లక్షలకు పైగా నగదు లభించగా అందులో సీజ్ చేసిన నగదును మంఘల్‌హాట్ పోలీసులు గోల్‌మాల్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఎస్‌‌బీ విచారణకు సీపీ ఆదేశించారు. ఎస్‌బీ విచారణలో నగదు గోల్‌మాల్ జరిగినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో మంఘాళ్‌హాట్ పోలీసులపై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు.

Exit mobile version