విధాత:నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో విషాదం చోటుచేసుకుంది.గురువారం సాయంత్రం కొత్త బ్రిడ్జిపై నుంచి కృష్ణానదిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుమలగిరి జమ్మన్నకోట తండా వద్ద కుమారుడు సాత్విక్ మృతదేహం లభ్యమైంది.దంపతుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
అయితే ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం జెన్‌కోలో పనిచేస్తున్న ఉద్యోగి మండారి రామయ్యకు చెందినది అని పోలీసుల విచారణలో వెల్లడైంది.తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రామయ్య(36) తన ఇంట్లో ఉత్తరం పెట్టి అదృశ్యమయ్యాడు.
ఆర్థిక సమస్యలు, అనారోగ్యంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రామయ్య సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.