Site icon vidhaatha

గోదావరి దూకి కుటుంబం ఆత్మహత్య

విధాత:యలమంచిలి మండలం చించినాడ గోదావరి వంతెన పైనుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం లో కంచి సతీష్ భార్య సంధ్య (28) మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది.దీనితో ఇప్పటికి 3 మృతదేహం లు లభ్యం కాగా వీరి 4 ఏళ్ళ కుమారుడు జస్వన్ మృతదేహం దొరకవలసి ఉంది .

సంధ్య మృత దేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి కి శవ పరీక్ష లు నిమిత్తం తరలించారు.వీరు గత శుక్రవారం ఆత్మహత్య చేసుకోవడంతో మృత దేహం బాగా కుళ్ళిపోయి పాడైపోయింది.తూగో జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు కు చెందిన కంచి సతీష్ కుటుంబం ఆత్మహత్య కు పాల్పడిన ఘటన అందరికీ తెలిసిందే..

Exit mobile version