విధాత:బైక్ పై అతివేగంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వెళ్తూ సేఫ్టీ గోడను ఢీకొని యువకుడు మృతి.ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.హైదరాబాద్ కెపిహెచ్ లో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.లైసెన్స్ తీసుకునేందుకు తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి బైక్ పై బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుండి అతి వేగంగా వెళ్తూ ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్ ను ఢీ కొట్టాడు.వెంటనే అదే మార్గంలో ప్రయాణిస్తున్న పలువురు వాహనదారులు అప్రమత్తమై 108లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.