Site icon vidhaatha

పేస్ బుక్ ద్వారా పరిచయం … నైజీరియన్ మోసం

విధాత:గిఫ్ట్ పంపిస్తున్నాను చెప్పి నమ్మించి తొమ్మిది లక్షలకు పైగా కాజేశాడు.బేగంపేటకు చెందిన కిరణ్ అనే వ్యక్తి కి ఫేస్ బుక్ లో Harry Robert పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.తను అమెరికాలో డాక్టర్ అని రాబర్ట్ నమ్మించాడు. నీకు అమెరికానుండి ఒక ఖరీదైన గిఫ్ట్ పంపిస్తున్నాను అని కిరణ్ కి ఫోన్ చేసి నమ్మబలికాడు.శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత గిఫ్ట్ ను రిసీవ్ చేసుకోవాలని చెప్పాడు.

తరువాత రెండు రోజులకు కిరణ్ కు ఒక నెంబర్ నుండి ఫోన్ వచ్చింది.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులమని, ఇలాంటి ఖరీదైన వస్తువులు తెప్పించుకోవడం నిబంధనలకు విరుద్ధమని మీ పైన కేసు నమోదు చేస్తామని బెదిరించాడు.గిఫ్ట్ టాక్స్ తో పాటు పెద్ద మొత్తంలో జరిమానా కడితేనే కేసు లేకుండా చేస్తామని ,వెంటనే తాను సూచించిన ఖాతాకు డబ్బులు పంపించాలని హెచ్చరించడంతో ఆందోళనకు గురైన కిరణ్ మొత్తం తొమ్మిది లక్షల పన్నెండు వేలు ట్రాన్స్ ఫర్ చేసారు.ఆ తర్వాత ఫోన్లు స్విచాఫ్ రావడంతో సిటీ సైబర్ క్రైమ్స్ లో బుధవారం ఫిర్యాదు చేశాడు.

Exit mobile version