Site icon vidhaatha

ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను తరలించిన జగ్గయ్యపేట పోలీసులు

విధాత:జోరున వర్షం,రహదారిలో ప్రమాదం.కోదాడ నుండి జగ్గయ్యపేట వస్తున్న ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనం పై వస్తూ గరికపాడు చెక్పోస్ట్ వద్ద కొద్ది దూరంలో రహదారి ప్రమాదానికి గురై ఇద్దరు అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. ఒక వ్యక్తి తీవ్ర గాయాలు పాలవడంతో అతని అంబులెన్స్ సహాయంతో వైద్యశాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రహదారిపై ఎవరు ప్రయాణం చేయడం లేదు. ఆ మృతదేహాన్ని చూసి సహాయం చేయడానికి వచ్చిన వారు కూడా లేరు.

అదే సమయంలో సమాచారం తెలుసుకున్న జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, చిల్లకల్లు ఎస్ఐ దుర్గా ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్,సిబ్బంది అందరూ కలిసి అ మృత దేహాలను ఒక వాహనం సహాయంతో ప్రమాద స్థలం నుండి మార్చురీకి తరలించారు.

జోరువాన సైతం లెక్కచేయకుండా, కష్టం తమదిగా భావించి,మానవత్వం గలిగిన హృదయంతో పోలీసులు చేసిన సేవకు అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version