Site icon vidhaatha

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విధాత,గుంటూరు జిల్లా: చిలకలూరిపేట – గుంటూరు జాతీయ రహదారి మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్లో మార్కాపురం నుంచి విజయవాడ వెళ్లి వస్తుండగా కొండ్రుపాడు సమీపంలోని జాతీయ రహదారిపై కారు స్కిడ్ అయ్యి సర్వీస్ రోడ్డు పై పడింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాను తొమ్మిది మందికి గాయాలయ్యాయి మల్లేశ్వరరావు (34) వ్యక్తి మృతి చెందాడు. వీరిని యడ్లపాడు 108 సిబ్బంది పైలెట్ రాము, ఈ.ఎం.టి సాయినాథ్ ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రిలో చేర్పించారు.

Exit mobile version