విధాత: సూర్యాపేట జిల్లా,కోదాడలో భారీగా గంజాయి పట్టుబడింది.రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద బస్సులో అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల గజాయిని పోలీసులు పట్టుకున్నారు.గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అరెస్టుచేసి ఈ గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాన్ని తెలసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.