Site icon vidhaatha

డిప్యూటీ సీఎం మేనల్లుడు అనుమానాస్పద మృతి

విధాత,సూళ్లూరుపేట: డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేనల్లుడు యర్రతోట నిఖిల్‌ (27) అనుమానాస్పద స్థితిలో మరణించారు.సోమవారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. తిరుపతి కొర్లగుంటలో నివసించే నారాయణస్వామి చెల్లెలి కుమారుడు నిఖిల్‌ పది నెలలుగా తడ శ్రీసిటీలోని కోబెల్కో కంపెనీలో పని చేస్తున్నారు. అవివాహితుడైన నిఖిల్‌ ఒక్కరే ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు.సోమవారం ఆయన విధులకు హాజరుకాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు..ఆ భవనంలోనే ఉంటున్న మరో ఉద్యోగికి ఫోన్‌చేసి ఎందుకు రాలేదో కనుక్కోవాల్సిందిగా కోరినట్లు తెలిసింది.ఆ ఉద్యోగి వెళ్లి చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.నిఖిల్‌ పంచెతో ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.కాగా ఇంటి తలుపులు బార్లతీసి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Exit mobile version