Site icon vidhaatha

మాస్క్ లేదని కస్టమర్‌ను కాల్చిన బ్యాంకు గార్డ్!

విధాత:మాస్కు ధరించకుండా బ్యాంకులోకి రాబోయిన ఓ కస్టమర్‌పై సెక్యురిటీ గార్డు కాల్పులు జరిపిన వైనమిది.యూపీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా జంక్షన్ రోడ్ బ్రాంచిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కస్టమర్‌ను రాజ్‌కుమార్‌గా గుర్తించారు. కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడడంతో అధికారులు వెంటనే అతడిని ఓ ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన గార్డు కేశవ్ ప్రసాద్ మిశ్రాను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్టు సిటీ ఎస్పీ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం.. ఇవాళ ఉదయం 11:30 గంటల సమయంలో బ్యాంకు పని మీద వచ్చిన రాజేశ్ కుమార్‌ను గార్డు అడ్డుకున్నాడు. మాస్కు లేకుండా లోపలికి వెళ్లొద్దని చెప్పినా రాజేశ్ బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇద్దరికీ కొద్దిపాటి ఘర్షణ జరిగింది.

ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గార్డు రాజేశ్‌పై కాల్పులు జరిపాడు. కాగా కస్టమర్ ఎంత చెప్పినా మాస్క్ ధరించకుండా రాబోయాడనీ.. అదేమని అడిగితే తనను బూతులు తిట్టాడంటూ గార్డు పోలీసులతో పేర్కొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తాను కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ గార్డు పేర్కొన్నాడు. కాగా కస్టమర్ స్పృహలోకి వచ్చిన తర్వాత అతడి వాంగ్మూలం కూడా నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

Exit mobile version