Site icon vidhaatha

చోరీలు కలకలం

గుంటూరు జిల్లాలోని తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల్లో మూడు చోరీలు జరిగాయి. గత రాత్రి మారిస్ పేట పాత పోస్ట్ ఆఫీస్ వద్ద ఇంటి ముందు ఉన్న స్కూటీ చోరీకి గురైంది. మొన్న రాత్రి టౌన్ పీఎస్ వెనుక ప్రాంతంలో రెండు చోట్ల చోరీలు జరిగాయి.

టీ స్టాల్ వద్ద పాన్ షాపును పగలగొట్టిన దుండగులు నగదును అపహరించారు. ఆ పక్కనే బ్యాటరీ షాపు ముందు నిలిపి ఉంచిన బొలెరో వాహనం మాయమైంది. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులను ఆశ్రయించిన కేసు నమోదు చేయకపోవడంపై బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయంటూ పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడాన్ని నిలిపివేశారు.

Exit mobile version