Site icon vidhaatha

విజయవాడలో వృద్ధురాలి కిడ్నాప్‌ కలకలం

విధాత,విజయవాడ : విజయవాడలో వృద్ధురాలి కిడ్నాప్‌ కలకలం రేపింది. రాత్రి 9 గంటల సమయంలో నారాయణపురం పెట్రోల్‌ బంకు ప్రాంతంలో ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు.కారులో తీసుకెళుతుండగా… ‘రక్షించండి..’ అంటూ ఆ వృద్ధురాలు కేకలు పెట్టింది.వృద్ధురాలి అరుపులు విన్న ఓ ఆటో డ్రైవర్‌ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.రంగంలోకి దిగిన పోలీసులు..ప్రత్యేక బృందాలతో నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు.కంట్రోల్‌ రూమ్‌లో సీసీ పుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version