Site icon vidhaatha

వివేకా హత్య కేసు: విచారణకు ఇద్దరు డ్రైవర్లు

విధాత:వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు.

★ మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.
★ కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను విచారిస్తున్నారు.
★ ఇవాళ పులివెందులకు చెందిన నలుగురు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు.
★ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు.
★ 20 రోజుల నుంచి వరుసగా వీరిద్దరినీ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
★ వీరితోపాటు పులివెందులకు చెందిన ఇద్దరు వాహనాల డ్రైవర్లను ప్రశ్నిస్తున్నారు.
★ రామ్మోహన్, బాబయ్య అనే ఇద్దరు డ్రైవర్లను విచారణకు పిలిచారు.
★ రెండేళ్ల కిందట వివేకా హత్య జరిగిన ముందు రోజు రాత్రి వివేకా ఇంటి పరిసరాల్లో కొన్ని వాహనాలు తిరిగినట్లు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది.
★ రవాణశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు ప్రైవేటు వాహనాల డ్రైవర్లను కడపకు పిలిపించి విచారిస్తున్నారు.

Exit mobile version