భర్త మర్మాంగాన్ని పండ్లతో కొరికి పరారైన భార్య

పెద్ద పెద్ద గొడవలకు చాలా సందర్భాల్లో చిన్న చిన్న వివాదాలే కారణమవుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. భార్యాభర్తల మధ్య భోజనం విషయంలో తలెత్తిన వివాదం దారుణ ఘటనకు దారి తీసింది.

  • Publish Date - May 8, 2024 / 08:29 PM IST

– ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

రాయపూర్ : పెద్ద పెద్ద గొడవలకు చాలా సందర్భాల్లో చిన్న చిన్న వివాదాలే కారణమవుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. భార్యాభర్తల మధ్య భోజనం విషయంలో తలెత్తిన వివాదం దారుణ ఘటనకు దారి తీసింది. భార్య తన పండ్లతో భర్త మర్మాంగాన్ని కొరికి, పరారైంది. తీవ్రగాయంతో నెత్తురోడిన భర్త అలానే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు భార్యాభర్తలిద్దరి వాంగ్మూలాలు తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లా డౌండి లోహారా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఖేరతా బజార్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

పునీత్ రామ్ సిన్హా (34) రోజు కూలీ చేసుకొని బతుకుతున్నాడు. బుధవారం మధ్యహ్నం ఆయన ఇంట్లోనే వున్నాడు. భార్య సరితను భోజనం పెట్టాలని అడిగాడు. ఆ సమయంలో ఆమె నిద్ర పోతున్నది. దానితో ఆమెకు చిరాకెత్తి లేచి పెట్టుకొని తిను అని జవాబిచ్చింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పునీత్‌ను భార్య దుర్భాషలాడటంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఒక దశలో రెచ్చిపోయిన సరిత.. తన భర్త పునీత్ మర్మాంగాన్ని తన పండ్లతో కొరికింది. పునీత్‌ అక్కడిక్కడే కూలబడిపోవడంతో అక్కడినుంచి పారిపోయింది. అయితే.. కేసు నమోదైన తర్వాత వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని భార్యాభర్తలను కోరినా వారు రాలేదని, దీంతో పోలీసులను పంపి వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి వాంగ్మూలం సేకరించామని పోలీస్‌ అధికారి అరవింద్ సాహు తెలిపారు. కేసు తీవ్రతను బట్టి విచారణ త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

 

Latest News