Site icon vidhaatha

Baba Wanga | యుగాంతం గురించి బాబా వంగా ఏమన్నారు.. 2024లో ఏం జరుగుతుందని చెప్పారు..?

Baba Wanga : యుగాంతం గురించి ప్రముఖ జ్యోతిష్యులు ఏం చెబుతున్నారనేది తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ ఉంటుంది. భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలో జ్యోతిష్యులు, జాతకులకు ఎల్లప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా ప్రవచనాలకు ప్రసిద్ధి చెందిన బాబా వంగా కూడా తన మరణానికి ముందు యుగాంతం గురించి, ఎప్పుడు ఏం జరగనుందనే దాని గురించి చాలా విషయాలు చెప్పారు.

బాబా వంగా చెప్పే అంచనాలు చాలావరకు నిజమయ్యాయి. ఈ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో కూడా బాబా వంగా ఊహించారు. తన మరణానికి ముందు ఆయన చాలా ప్రవచనాలు చెప్పారు. ఈ సందర్భంగానే ఈ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో చెప్పారు. 5,079లో ఈ ప్రపంచం పూర్తిగా అంతం కానుందని బాబా వంగా అంచనా వేశారు.

అదేవిధంగా 2024లో ఏం జరుగుతుందో కూడా బాబా వంగా ఆసక్తికర విషయాలు చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై స్థానికుడే హత్యాయత్నం చేస్తారని తెలిపారు. అన్నట్టే పుతిన్‌ను చంపేందుకు రష్యా ప్రైవేటు సైన్యం అధిపతి ప్రిగోజిన్ తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత అనుమానాస్పద విమాన ప్రమాదంలో అతడే మరణించాడు.

బాబా వంగా ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ విపత్తు, యువరాణి డయానా మరణం, అమెరికాలో 9/11 దాడులను గురించి కచ్చితంగా అంచనా వేశాడు. 2024 గురించి కూడా బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతున్నాయి. 2024లో యూరప్‌లో అనేక ఉగ్రవాద దాడులు జరుగుతాయని బాబా వంగా తెలిపారు. రష్యాలోని మాస్కోలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది.

రష్యా ప్రతీకారం కోసం చూస్తే అది ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పారు. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం పరిధి ఉక్రెయిన్‌ను దాటి విస్తరించే అవకాశం ఉంది. అలాగే సైబర్ దాడులు పెరుగుతాయని బాబా వంగా తెలిపారు. అన్నట్టే ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెరిగాయి. కాగా 12 ఏళ్ల వయసులో చూపు కోల్పోయిన బాబా వంగా 1996లో 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Exit mobile version