Site icon vidhaatha

సీఎం వైఎస్‌ జగన్‌ను క‌లిసిన‌ చినజీయర్‌ స్వామి

విధాత‌: సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి శ‌నివారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సంద‌ర్భంగా రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ను ఆహ్వనించారు. అనం త‌రం సీఎం వైఎస్‌ జగన్ చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు. చినజీయర్‌ స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు.

Exit mobile version