10.06.2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి జీవిత భాగ‌స్వామితో విబేధాలు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 10, 2024 / 07:34 AM IST

మేష రాశి

మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సోమరితనం తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారం బాగానే ఉంటుంది.

వృషభ రాశి

సహనం తగ్గుతుంది. ఉన్నత విద్య వైపు అడుగేసే విద్యార్థులకు కొన్ని ఆంటకాలు ఎదురవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పోయిన విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉంది

మిథున రాశి

ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు రావొచ్చు. పాత స్నేహితుల సహకారంతో ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి.

కర్కాటక రాశి

ఈ రాశివారి వ్యక్తిగత జీవితంలో అనుకోని ఇబ్బందులుంటాయి. కోపం తగ్గించుకోవాలి. మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది.

సింహ రాశి

ఈ రాశి ఉద్యోగులు మరోస్థానానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. బయటకు సంతోషంగా కనిపించినా ఏదో బాధ వెంటాడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కన్యా రాశి

సహనం తగ్గుతుంది. మాట ప్రభావం పెరుగుతుంది. ఏదో అసౌకర్యంగా ఉంటారు. ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

తులా రాశి

మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆస్తి నిర్వహణపై ఖర్చులు పెరగవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి వారితో కీలకమైన సమాచారం పంచుకోవద్దు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు బలహీనంగా ప్రారంభమవుతుంది. మాటలో కఠినత్వం ఉంటుంది. మీ ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. సంభాషణలో సంయమనం పాటించండి. అనుకోని ధనలాభం ఉంటుంది. సంపద పెరుగుతుంది .

ధనస్సు రాశి

పని పట్ల ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

మకర రాశి

అనవసర ఆలోచనలతో ప్రశాంతతను పోగొట్టుకోవద్దు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. నూతన ఆస్తి కొనుగోలు కోసం అడుగు ముందుకు వేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.

కుంభ రాశి

ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఆస్తులు పెరుగుతాయి కానీ ఖర్చులు కూడా అంతే ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. తీపి ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది.

మీన రాశి

మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కోపం తగ్గించుకోవాలి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తాన్ని పొందుతారు. పనిలో అధిక ఒత్తిడి తగ్గించుకోవాలి.

Latest News