11.06.2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి శుభ స‌మ‌యం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 11, 2024 / 06:46 AM IST

మేషం

అన్ని రంగాల వారికి ఈ రోజు పనులన్నీ ఆలస్యం అవుతాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం సహకరించదు. ఉద్యోగ, వ్యాపార రంగాలవారికి అధిక శ్రమ, ఆర్ధిక నష్టం సూచితం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

వృషభం

ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆందోళన, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. చాకచక్యంతో వ్యవహరిస్తే సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. విందువినోదాల్లో పాల్గొంటారు.

మిథునం

ఈ రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. కొన్ని ఆర్థికపరమైన చిక్కులు ఏర్పడినప్పటికి దైవానుగ్రహంతో తొలగిపోతాయి. ఉద్యోగస్థులకు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్ధిక ప్రయోజనాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి.

కర్కాటకం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు, బదిలీ, పెట్టుబడులపై లాభాలు వంటి అనేక శుభ ఫలితాల కారణంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.

సింహం

అన్ని రంగాల వారికి ఈ రోజు సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్ని అనుకోని ఘటనలు జరుగుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఉహించని ఆపదలు ఎదురుకావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. ముఖ్యమైన వ్యహారాల్లో నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది.

కన్య

ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభసమయం వచ్చింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందుకుంటారు. సంపద వృద్ధి చెందుతుంది. సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. గృహంలో సంతోషకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్‌ కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

వృశ్చికం

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు పని ప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. కానీ మీ ప్రతిభతో ప్రతికూలతలు అధిగమిస్తారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి.

ధనుస్సు

ఊహించని ఘటనలతో ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు పనిభారం పెరగడం వల్ల తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. స్థిరాస్తి, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు రావచ్చు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్‌, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు, మీ ఆదాయాన్ని పెంచుతాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్, స్థానచలనం ఉండవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ పనితీరు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్థులు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీ పనులు పక్కన పెట్టి విశ్రాంతి కోసం సమయం కేటాయించండి.

Latest News