12.06.2024 బుధ‌వారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి శుభ‌ప్ర‌దం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 12, 2024 / 07:09 AM IST

మేషం

ఈ రోజు మీకు బలహీనమైన రోజు కావొచ్చు. అనవసరమైన కోపం వల్ల హాని కలుగుతుంది. ప్రేమ సంబంధాలకు ఈ రోజు అనుకూలమైనది కాదు. మీ ఉద్యోగంలో అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి.

వృషభం

ఈ రోజు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు ఈ రోజు గృహోపకరణాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి రోజు అనుకూలమైనది కాదు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి.

మిథునం

ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ బాధ్యతలు పెరిగినప్పటికీ ఇంకా ఉత్సాహంగా ఉంటారు. ఇంటి వాస్తులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. మీరు మీ భవిష్యత్తును చాలా ఆలోచనాత్మకంగా ప్లాన్ చేసుకుంటారు.

కర్కాటకం

ఈ రోజు సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆవేశంగా మాట్లాడొద్దు. ఈ రోజు మీరు చేపట్టే పనులు నిదానంగా సాగుతాయి. చాలా ఓపిక ఉండాలి. మీరు ప్రయాణాలలో సమస్యలను ఎదుర్కొంటారు.

సింహం

మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుగా ఉంటారు. ఇతరుల గొడవల్లో మీ సమయాన్ని వృథా చేయకండి. మీరు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. పెట్టుబడి విషయంలో తొందరపడకండి.

కన్య

ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కోపం కారణంగా నష్టపోవచ్చు. మీ చుట్టూ ఉండేవారు చాలామంది మిమ్మల్ని వినియోగించుకుని మోసం చేస్తారు. వ్యాపారంలో ఇప్పట్లో నూతన ప్రయోగాలు చేయవద్దు.

తుల‌

ఉద్యోగులకు లాభదాయకమైన అవకాశాలుంటాయి. నిరుద్యోగులు విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ముఖ్యమైన పనికోసం డబ్బు ఖర్చుచేయాల్సి రావొచ్చు.

వృశ్చికం

వ్యాపారంలో వృద్ధి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధించగలరు. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు

మీకు ఈ రోజు పనిపట్ల బద్ధకంగా అనిపిస్తుంది. సహోద్యోగులతో గొడవలు పడే పరిస్థితి రావొచ్చు. వ్యాపారులు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బావుంటుంది..

మకరం

ఈ రోజు అనారోగ్య సూచనలున్నాయి. అనవసర పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది..

కుంభం

ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజ‌య‌వంతంగా పూర్తిచేస్తారు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది కానీ వారు చెప్పిన సలహాలు పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది.

మీనం

ఈ రాశివారు శత్రువుల కారణంగా మరింత బలపడతారు. చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వొద్దు. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయలేరు. అప్పులు చేయొద్దు. ఉద్యోగులకు కొన్ని చికాకులు తప్పవు.

Latest News