12.05. 2024 ఆదివారం.. ఈ రాశివారికి వ్య‌తిరేక ఫ‌లితాలే..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 12, 2024 / 05:22 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా, ప్రయోజన‌కరంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రయాణ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఎటు చూసినా వ్యతిరేక ఫలితాలే ఉన్నందున మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. గందరగోళం, నిర్ణయాల్లో అనిశ్చితి కారణంగా మంచి అవకాశాలను కోల్పోవచ్చు. రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వం కలిగి ఉండేందుకు ప్రయత్నించండి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్ధికపరంగా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మేలు. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తే మంచిది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం బాగోలేనందున అయోమయం, సందిగ్ధంతో ఉంటారు. అదృష్టం ఈ రోజు మీతో దాగుడుమూతలు ఆడుతుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే కుటుంబ సభ్యులతో వాదనలు, అపార్ధాలు చోటు చేసుకుంటాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి సరదాగా విహార యాత్రలకు వెళతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలమైన సమయం.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి శుభసమయం. అన్ని రంగాల వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. జీతం పెరుగుదలకు కూడా అవకాశాలు ఉన్నాయి .

తుల

తులారాశి వారికి ఈ రోజు శుభఫలితాలు ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్ రంగంలో ఉండేవారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు అందుకుంటారు. ఆర్ధిక పరమైన ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టడానికి, ప్రణాళికలను అమలుపరచడానికి అద్భుతమైన రోజు.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని పనులు మీరు అనుకున్నట్టుగా సాగవు కాబట్టి కొత్త స్కీములు, కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహనం గండం ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్ధిక నష్టం సూచితం.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సరదాగా, ఉల్లాసంగా గడుస్తుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. సామాజిక సమావేశాలు, కార్యక్రమాల్లో విభిన్నమైన వ్యక్తులను కలుసుకుంటారు. ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో కలహాల కారణంగా ప్రశాంతత లోపిస్తుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అందుకే కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఈ రోజు మొత్తం అశాంతితో, ఆందోళనతో ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యక్తులను పట్టించుకోకుండా ఉంటే మంచిది. ఆర్ధికంగా నష్టపోవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల నిరాశగా ఉంటారు. ఏ పని చేయాలన్నా శక్తి, ఉత్సాహం కొరవడుతుంది.

Latest News