14.06.2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి కుటుంబంలో గొడ‌వ‌లు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 14, 2024 / 06:56 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు, సన్మాన సత్కారాలు పొందుతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు జీతం పెరుగుదల వంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. నూతన బాధ్యతలను చేపడుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ మాటతీరు మార్చుకుంటే మంచిది. కోపాన్ని నియంత్రించుకుంటే మేలు. గృహంలో వాతావరణం ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్ధికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు చేపట్టిన ప్రాజెక్టులలో గొప్ప విజయాలను అందుకుంటారు. వృత్తి వ్యాపార రంగాల వారికి మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు, పనిలో పురోగతి ఉంటాయి. కుటుంబంలో గొడవలు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం

ఈ రోజు అసంతృప్తిగా ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మీనుంచి అప్పులు తీసుకునేవారు తిరిగి ఇచ్చేటప్పుడు వివాదాలకు దిగుతారు. ఆశించిన విధంగా పనులు జరగవు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టే పనులన్నీ ఈ రోజు దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగంతో, తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం కూడదు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మంచిది.

తుల

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం సరిగా లేనందున ఈ రోజు అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి, ఆర్థిక నష్టం ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడం వలన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఉన్నతాధికారుల గుర్తింపు పొందుతారు. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలకు వెళతారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు అధికం కావడం వల్ల చికాకులు, కోపం ఎక్కువవుతాయి. ఆరోగ్యం పట్ల చింత పెరుగుతుంది. వృత్తి వ్యాపార రంగాల వారు ఎంత కష్టపడినా చివరికి ప్రతికూల ఫలాలే ఉంటాయి. అనుకోని ఖర్చులు ఉండవచ్చు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తుల పనితీరు పట్ల పై అధికారులు అసంతృప్తితో ఉంటారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత లోపిస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు పెండింగ్ పడవచ్చు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆర్థికపరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

Latest News