14.05.2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారి ఆదాయం ప‌దింత‌లు పెరిగే అవ‌కాశం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - May 14, 2024 / 06:09 AM IST

మేషం

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు గ్రహసంచారం సరిగా లేనందున స్థిరాస్తులు సంబంధించిన చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం

మిధున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా సంతోషంగా గడుపుతారు. ఆర్ధిక స్థితిగతులు మెరుగు పడే మార్గాల గురించి ఆలోచిస్తారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. స్నేహితులు, బంధువుల నుంచి ఊహించని బహుమతులు, కానుకలు అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి, ఉద్యోగులకు ఈ రోజు శుభ పరిణామాలు జరుగుతాయి. చేపట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది.

కన్య

కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనుకోని ఖర్చులు రావడం వల్ల ధనవ్యయం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. మీ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. స్థిరాస్తి రంగం వారికి నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. బంధువుల నుంచి అందిన ఓ సమాచారం మీకు బాధ కలిగిస్తుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టానికి కారణం అవుతాయి. ఈ రోజు మీ జీవితం అనుకోని మలుపులు తిరిగే సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు సామాన్య ప్రయోజనాలే ఉంటాయి. ఉద్యోగులు మెరుగైన ఫలితాలను అందుకుంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం సహకరించదు.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు అత్యంత శుభఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఆదాయాన్ని పదింతలు పెరిగే అవ‌కాశం ఉంది. భారీ లాభాలను ఈ రోజు చూడబోతున్నారు. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు విశేషమైన ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో పనిచేసేవారు ఈ రోజు తప్పకుండా విజయాన్ని చూస్తారు. ఉద్యోగస్తులకు వారి ప్రతిభ, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు. ఆర్ధికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కష్టపడితే విజయం మీదే. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. కోపం అదుపులో ఉంచుకోవాలి.

Latest News