15.06.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 15, 2024 / 05:35 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు ఈ రోజు ఊహించని ధన ప్రవాహం ఉంటుంది. ఉద్యోగులకు ఆశించిన దానికన్నా గొప్ప ప్రమోషన్, విదేశాలలో పనిచేసి అవకాశం లభిస్తాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనలాభం, పనిలో పురోగతి వంటి ప్రయోజనాలు ఉంటాయి. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భవిష్యత్ పట్ల దిగులు, విచారం నెలకొంటాయి. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు పనిపట్ల ఏకాగ్రత శ్రద్ధ పెట్టడం అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగు పడతాయి. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. నిరాశ నిస్పృహలను విడిచి పెడితే మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడి కుటుంబంతో సంతోషంగా గడపండి. ఖర్చులు పెరుగుతాయి. గతంలో దూరమైన సంబంధాలు దృఢపడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సర్దుకుపోయే మీ స్వభావం, పరిస్థితులకనుగుణంగా మసలుకునే తీరుతో అసాధ్యమనుకున్న పనులను కూడా నెరవేరుస్తారు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. సమయానుకూలంగా వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ కోపం, పరుష పదాల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మాట్లాడకుండా ఉండండి. వ్యాపారంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఎవరితోనూ ఘర్షణ పడకండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తివ్యాపార రంగాల వారికి ఈ రోజు అనేక నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనిని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభసమయం నడుస్తోంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి, ఉద్యోగులకు సామాన్య ఫలితాలే ఉంటాయి. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. మనోబలంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం

మకరరాశి వారికిఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఇంట్లో ఘర్షణపూరిత వాతవరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనుకావడంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. కోపాన్ని, మాటలను వీలైనంత అదుపులో ఉంచుకోవడం మంచిది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, రచయితలకు అనుకూలమైన సమయం. అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటారు. అవార్డులు, సన్మానాలు పొందుతారు. స్థిరాస్తి రంగం వారికి శుభయోగం నడుస్తోంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.

Latest News