19.06.2024 బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ఆర్థిక లాభం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 19, 2024 / 06:40 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సన్నిహితులను మీ పరుష మాటలతో నొప్పిస్తారు. నూతన కార్యక్రమాలు, ప్రయాణాలు ఈ రోజు వాయిదా వేసుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సంతోషంగా గడుస్తుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి, ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు ఫలప్రదమవుతుంది. ఉద్యోగులు ఉన్నత పదవులను అలంకరిస్తారు. వృత్తివ్యాపార రంగాల వారికి విజయసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఊహించని ఆర్థిక లాభం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. కోపావేశాలతో సాధించేది ఏది లేదని గుర్తు పెట్టుకోండి. ఖర్చులు పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారికి తీవ్ర శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తిపరంగా కొన్ని వివాదాలూ చోటు చేసుకోవచ్చు. సహనంతో, సర్దుబాటు ధోరణితో ఉంటే వివాదాలు సమసిపోతాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు విశేషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుంది. గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను గడిస్తారు. సమాజంలో గొప్ప పరపతి, ప్రతిష్ఠ పెరుగుతాయి. ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశావాదంతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేసి శభాష్ అనిపించుకుంటారు. ఆశించిన ప్రమోషన్ కూడా అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు గొప్ప శుభకరంగా ఉంటుంది. పురోగతి, ధనలాభం ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. విహార యాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలు ఉంటాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. ఉద్యోగులకు విజయలక్ష్మి వరిస్తుంది. ఏ రంగంలో అడుగుపెట్టినా, పట్టింది బంగారం అవుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఊహించని శుభఘడియలు రానున్నాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజంతా సుఖ సంతోషాలు, ధనలాభాలతో నిండిపోతుంది. అన్ని రంగాల వారు సునాయాసంగా లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగరీత్యా ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక లబ్ధి ఉండవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విరామం లేకుండా పనిచేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. వైద్య ఖర్చుల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. మీరు చేసే చిన్న తప్పు కూడా చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది.

Latest News