01.07.2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అనుకోని విధంగా లక్ష్మీకటాక్షం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - July 1, 2024 / 06:53 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. లాభాలు పెరుగుతాయి. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అంత ఆశాజనకంగా ఉండదు. వృత్తి వ్యాపార రంగాల వారికి చేపట్టిన పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. తీరికలేని పనులు, తీవ్రమైన ఒత్తిడి ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. సన్నిహితులతో విబేధాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలతో గందరగోళానికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం, ఆప్యాయతలు మెరుగుపడతాయి. కళాకారులకు, మీడియా రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్ధిక లాభాలుంటాయి. పదోన్నతుల కోసం ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. ధన నష్ట సూచితం. వ్యాపారులు వ్యాపారంలో రాణిస్తారు. లాభాలను ఆర్జిస్తారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి ప్రారంభించిన పనులన్నీ సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. సమయానుకూలంగా నడుచుకుంటే ముఖ్యమైన కార్యాలలో విజయం ఉంటుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా మీ మాట తీరు కారణంగా కలహాలు ఏర్పడతాయి. గృహంలో అశాంతి నెలకొంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. విదేశాల నుంచి అందుకున్న శుభవార్తలు మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అపజయాలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే సహనంతో ఉండండి. ఇంటా బయట శాంతంగా ఉంటూ కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంతానం చదువు, ఉద్యోగాల గురించి ఆందోళనకు గురవుతారు. ప్రయణాలు వాయిదా వేసుకోండి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం బాగోలేనందున ఎటు చూసినా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా అధిక ధనవ్యయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలహాలు ఉండవచ్చు. మీ మొండితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా శత్రువులు పెరుగుతారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇన్నాళ్ళుగా వేధించిన సమస్యలు, ప్రతికూల పరిస్థితులు తొలగి పోతాయి. అదృష్టం వరిస్తుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని చూస్తారు. వ్యాపారస్తులకు ధన ప్రవాహం ఉంటుంది. అనుకోని విధంగా లక్ష్మీకటాక్షం ఉంటుంది.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లాభనష్టాలు సరి సమానంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఘర్షణలకు దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Latest News