20.06.2024 గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అన్ని శుభాలే..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 20, 2024 / 06:38 AM IST

మేషం

ఈ రాశివారికి ఇవాళ సామాన్యంగా ఉంటుంది. చేసే పనులు చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేస్తే మంచి విజయాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. లాభాలు పొందగలరు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.

వృషభం

ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని విధంగా సంపదలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విహార యాత్రలకు వెళతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ప‌ని చేసే చోట‌ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సమకూరుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది.

క‌ర్కాట‌కం

ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమయస్ఫూర్తిగా, ముందుచూపుతో వ్యవహరిస్తే విజయం సిద్ధిస్తుంది. తొందరపాటు లేకుండా నిదానంగా వ్యవరిస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

సింహం

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కొన్ని రోజులుగా వేధిస్తున్న సమస్యల నుంచి బయట పడతారు. సహోద్యోగుల సహకారంతో అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల వారికి కార్య సిద్ధి, ఆర్ధిక లబ్ది ఉంటాయి. పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు అందుకుంటారు. గృహంలో శుభకార్యాల మూలంగా ధనవ్యయం ఉంటుంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం సహకరించదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. మీ మొండి వైఖరి కారణంగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కలహాలు ఏర్పడతాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితుల నుంచి సహకారాలు అందుకుంటారు. నూతన ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఆర్ధికంగా నష్టపోతారు. మాటలను నియంత్రణలో పెట్టుకోలేని కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. మాటతీరును మార్చుకోకపోతే రోజంతా వాదనలతో గడిచిపోతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

మకరం

ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఉగ్యోగంలో మార్పు కోరుకునే వారు విదేశాలలో పనిచేసే అవకాశాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలను పొందుతారు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి చక్కగా పూర్తవుతాయి. ఉద్యోగులు మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు. ఇది మీలో మరింత ఉత్సాహం నింపుతుంది. సహోద్యోగుల సహకారంతో కష్టపడి పనిచేసి తిరుగులేని శక్తిగా ఎదుగుతారు.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు సామాన్య ఫలితాలు ఉంటాయ. ప్రతికూల ఆలోచనలను వీడితే మంచిది. వ్యాపారులు తమ పోటీదారులతో విరోధులతో వాగ్వాదాలకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. అనారోగ్య సమస్యల కారణంగా ధనవ్యయం ఉండవచ్చు.

Latest News