21.06.2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయం మూడింత‌లు పెరుగుతుంది..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 21, 2024 / 07:07 AM IST

మేషం

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. దైవదర్శనం కోసం తీర్థయాత్రలకు వెళతారు. అందరితో పరస్పరం సహకరించుకుంటే ముందుకెళ్తే విజయం మీదే! ఆదాయం పెరుగుతుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆర్ధికంగా తీవ్రమైన నష్టాలు రావడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అయితే ముందు జాగ్రత్తతో అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకునే నష్ట తీవ్రత తగ్గుతుంది. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి దండకం పఠిస్తే మనోబలం పెరుగుతుంది.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలను చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కళలు, సాహిత్య రంగం వారు బిరుదులు, సత్కారాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తీవ్ర ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. పరోపకారానికి పోయి చిక్కుల్లో పడే అవకాశముంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న సువర్ణావకాశం రానేవచ్చింది. మీలో దాగిఉన్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఆదాయం మూడింతలు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం, పదవీయోగం వరిస్తాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మెరుగైన పురోగతి, ధన లాభం ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అందరినీ సంప్రదించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి కారణంగా శారీరక శ్రమ పెరుగుతుంది. తగిన విశ్రాంతి అవసరం. గురుధ్యాన శ్లోకాలు పఠిస్తే ప్రశాంతత కలుగుతుంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. పని ఒత్తిడి కారణంగా తీవ్ర అలసటకు గురవుతారు. ఇతరులు చేసే విమర్శలను పట్టించుకోవద్దు. పని పట్ల ఏకాగ్రత, చిత్తశుద్ధితో ఉంటే విమర్శకులు మీ జోలికి రారు. వ్యాపారస్తులు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను పట్టించుకోవద్దు. మిమ్మల్ని దెబ్బ తీయడానికి ప్రత్యర్ధులు, అవకాశవాదులు ఎదురు చూస్తున్నారు. సమయానుకూలంగా నడుచుకుంటే విజయం లభిస్తుంది.

ధనుస్సు

ఆర్ధిక నష్టాలు, పెరిగిన ఖర్చులతో ఆందోళన నెలకొంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి తీవ్ర కృషితోనే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. పదోన్నతి కోసం ఎదురు చూసేవారు శుభవార్తలు వింటారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి పనిలో పురోగతి, ఆదాయం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫైనాన్స్ , కమిషన్ వ్యాపారులకు ధనాదాయం పెరుగుతుంది. కళాకారుల ప్రతిభకు పురస్కారాలు అందుకుంటారు. కుటుంబంలో శాంతి సౌఖ్యం ఉంటాయి.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో మార్పు కోరుకునే వారికి, నిరుద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.

Latest News