22.04.2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ధ‌న ప్ర‌వాహం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని న‌మ్ముతుంటారు. ఏ ప‌ని ప్రారంభించినా స‌రే త‌మ రాశుల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌నుల‌ను, శుభ‌కార్యాల‌ను ప్రారంభిస్తారు మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - April 22, 2024 / 06:19 AM IST

మేషం

ఈ రాశివారికి ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకుంటే మంచిది. కొన్ని ముఖ్య‌మైన ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది. బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే మంచిది.

వృష‌భం

ఈ రాశివారికి ఇవాళ కొంచెం నిరుత్సాహం ఉంటుంది. అల‌స‌ట పెరిగి చికాకు ప‌డుతుంటారు. కొన్ని వ్య‌వ‌హారాల్లో తెలివితో వ్య‌వ‌హ‌రిస్తారు. మీ మ‌నోధైర్య‌మే మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది.

మిథునం

ఈ రాశివారికి ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉంది. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టుద‌ల‌తో స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తారు. కుటుంబ స‌భ్యుల మాట‌కు విలువ ఇస్తారు. ఇంట్లో శుభ‌వార్త వింటారు.

క‌ర్కాట‌కం

క‌ర్కాట‌క రాశి వారికి అనుకూల వాతావ‌ర‌ణం ఉంది. ప్రారంభించిన ప్ర‌తి ప‌నిలో విజ‌యం సాధిస్తారు. ఆశించిన ఫ‌లితాలు సొంత‌మ‌వుతాయి. కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో స‌ఫ‌లం అవుతారు.

సింహం

ఈ రాశివారికి ప‌రిస్థితులు అంతంత మాత్ర‌మే అనుకూలంగా ఉన్నాయి. శారీర‌క శ్ర‌మ పెరిగే అవ‌కాశం ఉంది. చేయ‌ని పొర‌పాటుకు నింద‌ప‌డాల్సి వ‌స్తుంది. మ‌నో ధైర్యాన్ని కోల్పోవ‌ద్దు. బంధువుల‌తో విబేధాల‌కు ఆస్కారం ఉంది.

క‌న్య

ఈ రాశివారికి బంగారు భ‌విష్య‌త్ కోసం వ్యూహ ర‌చ‌న చేస్తారు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ఒక సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

తుల‌

ఈ రాశివారికి ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉంది. ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌డ‌బ‌డుతారు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఇది ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు మీ కోసం అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. చేసే ప్రతి పనిలోనూ విజయం మీ వెన్నంటే ఉంటుంది. ధన ప్రవాహం ఉంటుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్ధతను నిరూపించుకుంటారు. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవివాహితులు తమ కాబోయే జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. మానసిక ప్రశాంత కోసం యోగా, ధ్యానం చేయండి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. చిత్రసీమ, ఫైన్ ఆర్ట్స్ రంగాల వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు మెండుగా వస్తాయి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

 

Latest News