22.06.2024 శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రెండు రాశుల వారికి ఊహించ‌ని ధ‌న‌లాభం..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 22, 2024 / 07:14 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు సామాన్యంగా ఉంటాయి. నూతన ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో కలిసి తీర్ధ యాత్రలకు వెళతారు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఎంత కష్టపడినా విజయం సులభంగా లభించదు. ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. దైవారాధన మీద దృష్టి సారించాలి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి పనుల్లో పురోగతి, ఆర్ధిక వృద్ధి ఉంటాయి. సమాజంలో పేరొందిన గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. పదవీయోగం, లక్ష్మీ కటాక్షం ఉంటాయి. స్నేహితులతో , కుటుంబ సభ్యులతో సంతోషంగా విహారయాత్రలకు వెళతారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో వాతావరణం ఆనందోత్సాహాలతో ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడుపుతారు. వ్యాపారస్థులు మంచి లాభాలను సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీదే తుది నిర్ణయం అవుతుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కవులు, రచయితలకు కల్పనా శక్తి వెయ్యింతలవుతుంది. ప్రకృతి పరంగా కవితలు రాసేందుకు తగిన ప్రేరణ ఉంటుంది. సంతానం పురోగతి ఆనందాన్ని ఇస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల వారు చేపట్టిన పనులు విజయాలను చేకూరుస్తాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలకు అవకాశం ఉంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉండవచ్చు.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సోదరులు, రక్త సంబంధీకులతోనూ అనుబంధాలు దృఢపడతాయి. ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలను అందుకుంటారు. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో సాధారణ ఫలితాలే ఉంటాయి. మీ మాటలను అదుపులో పెట్టుకోవాలి. మీ దురుసు ప్రవర్తనకు సన్నిహితులు బాధపడతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యక్తిగత జీవితంలో శుభవార్తలు, సానుకూల ఫలితాలు ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం పదింతలు అవుతుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మికమైన విషయాలపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ధనవ్యయం ఉండవచ్చు. శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో శ్రద్ద వహించండి. ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్త వహించండి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లక్ష్య సాధన కోసం తీవ్ర కృషి చేస్తారు. ఉద్యోగస్థులు పట్టుదలతో పనిచేసి ప్రమోషన్​కు అర్హత సాధిస్తారు. వ్యాపారస్థులకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉండవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజు. అన్ని రంగాల వారిని అదృష్టం వరిస్తుంది. కుటుంబంలో వేడుకలు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎదురు చూడని శుభవార్తలు, ఊహించని ధనలాభం ఈ రోజు మిమ్మల్ని సంతోషంలో ముంచెత్తుతాయి.

Latest News