23.06.2024 ఆదివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 23, 2024 / 06:32 AM IST

మేషం

ఈ రాశి వారికి ఇవాళ సామాన్యంగా ఉంటుంది. ఆర్ధిక ప్రయోజనాలు సామాన్యంగా ఉంటాయి. నూతన ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటారు. తీర్ధ యాత్రలకు వెళతారు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేక‌పోతే శత్రువులు పెరుగుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

వృషభం

ఈ రోజు అనుకూలంగా లేదు. ఎటు చూసినా వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ప్రసన్నంగా ఉండడం మంచిది. ఒత్తిడి తప్పదు. ఆశించిన ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలం కాదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కొత్త పనులు ప్రారంభించవద్దు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మిత్రువర్గంలో, బంధు వర్గంలో మీరు ఉన్న‌తంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. నూతన వస్త్ర, వాహనాలు, గృహోపకరణ వస్తువులు, కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు చాలా అదృష్టకరమైన రోజు. స్నేహితులు, సహోద్యోగులు నుంచి ఆర్థిక సహకారాలు అందుతాయి. ఉద్యోగులకు మీ పై అధికారి మీ పనికి సంతృప్తి చెందుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కోప స్వభావాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సృజనాత్మకతతో ఆలోచించి అందరి కంటే ముందంజలో ఉంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు.

కన్య

సోమరితనం, బద్దకం కారణంగా పనిలో నాణ్యత లోపిస్తుంది. ఏ పని కూడా సమయానికి పూర్తికాదు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. ఇంట్లో అందరి పట్ల విసుగు, చికాకు ప్రదర్శిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలకు సమయం అనుకూలంగా లేదు. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

తుల

ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. సర్వత్రా విజయం, ఆర్ధికవృద్ధి, శత్రుజయం ఉంటాయి. సన్నిహితులతో పర్యాటక ప్రదేశాలలో పర్యటిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆస్తి వ్యహారాలలో మీదే తుది నిర్ణయం అవుతుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అనవసర కలహాలు ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి తీవ్రమైన శ్రమ, పని ఒత్తిడి ఉంటుంది. బంధువులతోనూ, కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు, అసైన్మెంట్లు తీసుకోవడానికి శుభప్రదమైన రోజు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మీనం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు చేసే అన్ని ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను పొందడమే కాకుండా, ఆ రంగంలో రాణిస్తారు. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి.

Latest News